మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం RRR ఆస్కార్ ప్రమోషన్స్ నిమిత్తం USA లో ఉన్నారు. అక్కడ పలు ప్రెస్టీజియస్ ఈవెంట్లకు, షోలకు హాజరవుతూ చాలా బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఒక అమెరికన్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తన ఆల్ టైం ఫేవరెట్ మూవీస్ లిస్ట్ ను రివీల్ చేసారు.
ది నోట్ బుక్, టెర్మినేటర్ 2, గ్లాడియేటర్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ .. ఈ నాలుగు సినిమాలు తనకు ఫేవరెట్ అని చరణ్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలానే క్వెంటిన్ టరంటినో అన్ని సినిమాలు చాలా ఇష్టమని చెప్పారు. ఇండియన్ సినిమాలలో దానవీర సూరకర్ణ, మిస్టర్ ఇండియా, బాహుబలి, రంగస్థలం సినిమాలు తనకు నచ్చిన, తాను మెచ్చిన సినిమాలలో కొన్ని అని చెప్పారు.