టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ప్రొడక్షన్ హౌసెస్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ నిర్మిస్తోంది. అయితే వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ఈ మధ్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ప్రాజెక్ట్ కె’ను ఆధునిక విష్ణువు అవతారంగా అశ్వినీదత్ అభివర్ణించారు. ప్రభాస్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్ ఉన్నాయట.