ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి ఈ రోజు ఉదయమే సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది. పుష్ప తదుపరి బన్నీ ఇప్పటివరకు ఎలాంటి న్యూ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చెయ్యకపోవడంతో, ఏ డైరెక్టర్ తో బన్నీ తన నెక్స్ట్ మూవీని చెయ్యబోతున్నాడో తెలుసుకోవాలని ప్రేక్షకాభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఐతే, ఆ ఎదురుచూపులకు నేటితో కాలం చెల్లింది.
ఐకాన్ స్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సూపర్ హిట్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగను ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించారు. విశేషమేంటంటే, బాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్ తో కలిసి సందీప్ రెడ్డి వంగ యొక్క భద్రకాళి ప్రొడక్షన్స్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీ చిత్రంగా నిర్మిస్తుంది.
మరైతే, ఈ సడెన్ క్రేజీ న్యూస్ కి ఐకాన్ స్టార్ అభిమానుల్లో ఫుల్ ఖుషి నెలకొంది. ఐతే, మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టేటట్లుంది. ఎందుకంటే, బన్నీ పుష్ప సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉండగా, సందీప్ యానిమల్, స్పిరిట్ చిత్రాలను పూర్తి చెయ్యాల్సి ఉంది.