గతేడాది విడుదలైన సినిమాల్లో మోస్ట్ ట్రోలింగ్ కు గురైన సినిమా ‘ది లెజెండ్’. ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకు జేడీ జెర్రీ దర్శకత్వం వహించగా.. ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించారు. కాగా ఈ చిత్రం మార్చి 3వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని లెజెండ్ శరవణన్ స్వయంగా ప్రకటించారు.