బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ముంబైలోని షారుఖ్ నివాసం మన్నత్ లోకి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారు. అప్రమత్తం అయిన భద్రతా సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు గుజరాత్ కి చెందిన వారుగా తేలింది. షారుఖ్ అంటే చాలా అభిమానమని, తమ ఇష్టమైన నటుడిని దగ్గర నుంచి చూడటానికే అలా చేసినట్లు వెల్లడైంది.
![]() |
![]() |