కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా "దసరా". తాజాగా కాసేపటి క్రితమే మేకర్స్ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు విడుదలైన రెండు లిరికల్స్ శ్రోతలను విశేషంగా మెప్పిస్తుండగా, సాయంత్రం 06:03 నిమిషాలకు థర్డ్ సింగిల్ రిలీజ్ ఎనౌన్స్మెంట్ చెయ్యబోతున్నట్టు పేర్కొన్నారు. మరి, సంతోష్ నారాయణ్ స్వరకల్పనలో ఫోక్ మెలోడీగా రూపొందిన ఈ పాట ఎప్పుడు విడుదల కాబోతుందో తెలుసుకోవాలంటే ఇంకాసేపు వేచి చూడాల్సిందే.