హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ మాస్ ఎంటర్‌టైనర్ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల జోడిగా కనిపించనున్నట్లు సమాచారం. రానున్న రోజులలో మూవీ మేకర్స్ కొత్త పోస్టర్ ని రివీల్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పవర్ ఫుల్ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.