షాజీ కైలాస్ దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన 'అలోన్' చిత్రం రిపబ్లిక్ డే రోజున థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. తాజగా ఇప్పుడు, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ చిత్రం మార్చి 3, 2023న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. మంజు వారియర్, అన్నీ షాజీ కైలాస్, సిద్ధిక్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది.