టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి చేసుకున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫిల్మ్ నగర్లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడు ముళ్లు వేశాడు. ఇరువర్గాల కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరిగింది. ఈ వివాహానికి వైఎస్ విజయమ్మ గారు, టీజీ వెంకటేష్, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లాణి, దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు.