భూమా మౌనిక రెడ్డిని పెళ్లిచేసుకున్న అనంతరం మంచు మనోజ్ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ప్రజాసేవ చెయ్యాలన్న కోరిక ఉంది. కానీ మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే మద్దతు ఇస్తాను. ప్రేమ ఎప్పుడూ గెలవాలి. నా విషయంలో అది నిజమైంది‘ అంటూ చెప్పుకొచ్చారు.