విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్. గమ్యం, రన్ రాజా రన్, మహానుభావుడు, ఒకే ఒక జీవితం, పడిపడి లేచే మనసు.. ఇలా డిఫరెండ్ జోనర్ సినిమాలు తీస్తూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. అయితే శర్వా తాజాగా నటిస్తున్న #sharwa35 పోస్టర్ ఆసక్తిగా మారింది. అతని పుట్టినరోజు సందర్భంగా 35వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శర్వా వార్తాపత్రిక ప్రకటన లాగా రూపొందించిన పోస్టర్‌లో ఆకట్టుకుంటున్నాడు.