తొలిచిత్రంతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ . వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నార్త్, సౌత్ లో జోష్ కనబరుస్తోంది. సౌత్ లో మాత్రం ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదు. తొలిచిత్రంతోనే దక్షిణాది ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
గతేడాది విడుదలైన బ్టాక్ బాస్టర్ ఫిల్మ్ ‘సీతారామం’తో సౌత్ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ప్రిన్స్ నూర్జహాన్, సీత పాత్రల్లో జీవించి ఆడియెన్స్ మదిలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజ్ అంతా ఇంతా లేదు.
ఇదిలా ఉంటే.. మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. తన అభిమానులను ఆకట్టుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ వస్తున్నారు. మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతోనూ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిసిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ ను పంచుకుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ‘గుడ్ హెయిర్ డే’ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్ చేసింది. గ్రీన్ చుడీదార్ లో మెరిసిపోతోంది. అందమైన కురులతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు అద్దం ముందు నిలువెత్తు అందాలనూ ప్రదర్శించింది.
#MrunalThakur Latest Clicks pic.twitter.com/nq4jFDJJ14
— Cinema Mania (@ursniresh) March 6, 2023