నెల్సన్ దిలీప్‌కుమార్ 'బీస్ట్' సినిమా తరువాత ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు అనిరుధ్ సంగీతం అందించారు. గత కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ లెజెండ్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్ 'జైలర్'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే జాకీ ష్రాఫ్ నెల్సన్ కు రెట్రో పసుపు స్కూటర్ నెల్సన్‌ను బహుమతిగా ఇచ్చాడు, ఈ విషయంపై నెల్సన్ బహుమతి ఇచ్చిన జాకీ ష్రాఫ్ కి కృతజ్ఞతలు తెలిపాడు.