యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి తాజాగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాలో రూపొందబోతున్న లవ్ యాక్షన్ డ్రామాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. శివమ్ సెల్యులాయిడ్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరం నటిస్తున్న 9వ సినిమా.
ఈ సినిమా రేపు ఉదయం 07:45 నిమిషాలకు హైదరాబాద్, రామోజీనాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. ఈ చిత్రానికి సామ్ CS సంగీతం అందిస్తున్నారు. మరి, ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన విషయాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa