బాలీవుడ్ నుండి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం "పఠాన్". షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడిగా వ్యవహరించారు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్గా నటించారు. ఇక, ఈ సినిమా జనవరి 25న విడుదల కాగా అప్పటి నుండి ఎడతెరిపి లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. 500కోట్ల NBOC మార్క్ అందుకున్న తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
ఇక 42వ రోజు అంటే 6వ మంగళవారం ఈ సినిమా కోటికి పైగానే వసూలు చేసిందని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు 18.47 కోట్లను వసూలు చేసిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా 42 రోజుల్లో 536.77 కోట్లను కలెక్ట్ చేసింది.