అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. దాదాపు దశాబ్దం పాటు ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ పెళ్లి తరవాత కాస్తంత సినిమాల వేగం తగ్గించింది. ఆపై బిడ్డ నీల్ కడుపులో పడ్డాక సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. వచ్చే నెలతో నీల్ కి ఏడాది వస్తుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన బిడ్డను ఎలా పెంచాలనుకుంటుందో చెప్పింది. నీల్ కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకుండా పెంచే యోచనలో ఉన్నట్టుగా చెప్పింది. అలానే సినిమాలకు కూడా దూరంగా ఉంచాలని చూస్తున్నట్టు చెప్పింది. ఐతే, నీల్ కి 8 ఏళ్ళు వచ్చేవరకే ఇదంతా. ఆపై తలపతి విజయ్ తో తాను నటించిన సూపర్ హిట్ మూవీ "తుపాకీ" ని మొదటిసారిగా నీల్ కి చూపించాలని అనుకుంటున్నట్టుగా కాజల్ పేర్కొంది.