"దాస్ కా ధమ్కీ" చిత్రం నుండి నిన్న విడుదలైన 'ఓ డాలర్ పిలగా' పాటకు శ్రోతల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. సింగర్ మంగ్లీ పాడిన ఈ సీజ్లింగ్ సాంగ్ కి సతీష్ కృష్ణన్ కొరియోగ్రఫీ అందించారు. పూర్ణాచారి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో ఒకటిగా ట్రెండ్ అవుతుంది.
ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న ఈ చిత్రానికి యంగ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలానే హీరోగా కూడా నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కరాటే రాజు నిర్మిస్తున్నారు.