సుహాస్ హీరోగా నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమాకి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాని జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 3న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'జీ5'లో మార్చి 17 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.