బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ సివియర్ హార్ట్ ఎటాక్ కి గురై, కన్నుమూశారు. ముంబైలోని సతీష్ స్వగృహంలోనే ఆయన మరణించడం జరిగింది. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ సతీష్ కౌశిక్ కి మంచి ఫ్రెండ్. సతీష్ నటుడు, దర్శకుడు మాత్రమే కాదు.. మంచి కమెడియన్ కూడా. అలానే నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా కూడా సినీపరిశ్రమకు సేవ చేసారు.