ప్రముఖ నటుడు, డైరెక్టర్ సతీష్ కౌశిక్ కన్నుమూశారు. 1956 ఏప్రిల్ 12న హర్యాణాలోని మహేంద్రగఢ్ లో ఆయన జన్మించారు. ఆయన ఎలా మరణించారనే దానిపై స్పష్టత రాలేదు. 1983లో వచ్చిన మసూమ్ చిత్రంతో యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించి, స్కాం 1992 వెబ్ సిరీస్ తో పాటు ఎమర్జెన్సీ, మిస్టర్ ఇండియా లాంటి చిత్రాల్లో నటించారు. తేరే నామ్, వాదా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలియజేశారు.