మలయాళ సూపర్ హిట్ 'పొరింజు మరియం జోస్' ని తెలుగులో ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో సీనియర్ హీరో నాగార్జున రీమేక్ చేయబోతున్నారని, ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ఇప్పటికే ప్రసన్న పూర్తి చేసాడని, ఉగాదికి ఈ సినిమాపై అఫీషియల్ క్లారిటీ రాబోతుందని జరుగుతున్న ప్రచారం గురించి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు ఈ న్యూస్ పై అఫీషియల్ క్లారిటీ అందుతుంది. పొరింజు మరియం జోస్ మలయాళ మూవీని తెలుగులో ఒక టాప్ హీరోతో, ట్యాలెంటెడ్ టెక్నికల్ టీంతో రీమేక్ చెయ్యబోతున్నామని పేర్కొంటూ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణసంస్థ నిన్న హోలీ సందర్భంగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది.
దీంతో నాగార్జున - ప్రసన్న కుమార్ల ప్రాజెక్ట్ నిజమేనని ప్రేక్షకాభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మరి, పొరింజు మరియం జోస్ నటీనటుల వివరాలు తెలియాలంటే, మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.