అనారోగ్యం కారణంగా క్రేజీ హీరోయిన్ సమంత నటిస్తున్న అప్ కమింగ్ మూవీ "ఖుషి" షూటింగ్ కి లాంగ్ బ్రేక్ పడిన విషయం అందరికి తెలిసిందే. మాయోసైటిస్ నుండి ఈమధ్యనే సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్న సమంత తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా మారింది. నిన్న మొన్నటి వరకు మోస్ట్ యాంటిసిపేటెడ్ 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొన్న సమంత తాజాగా ఖుషి సెట్స్ కు చేరుకుందని తెలుస్తుంది.
నిన్న ప్రపంచమహిళా దినోత్సవం రోజున సమంత ఖుషి టీంతో జాయిన్ అయ్యింది. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ, ఉమెన్స్ డే విషెస్ చెప్తూ ఖుషి టీం సమంత చేత కేక్ కట్ చేయించింది. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు కాగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.