ట్యాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అవుతుంది. గతేడాది విరాట పర్వం, గార్గి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పల్లవి ఇప్పటివరకు ఎలాంటి కొత్త తెలుగు సినిమాను ప్రకటించలేదు. కోలీవుడ్ లో హీరో శివకార్తికేయన్ తో ఒక సినిమాలో నటిస్తుంది.
పల్లవి తెలుగు ప్రేక్షకులకు కనబడి చాన్నాళ్ళవుతున్న నేపథ్యంలో ఆమె పాల్గొన్న 'నిజం విత్ టాక్ షో' నుండి నిన్న విడుదలైన ప్రోమో ఆసక్తిని సంతరించుకుంటుంది. ఈ ప్రోమోలో స్మిత పల్లవిని తారక్, బన్నీ, చరణ్ లలో ఎవరితో డాన్స్ చెయ్యాలని మీకుంది? అని అడుగుతుంది. ఇందుకు సమాధానంగా ముగ్గురితో కలిసి ఒక పాటలో డాన్స్ చెయ్యాలనుందని పల్లవి సరదాగా చెప్పడంతో..అక్కడ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. మరి, నిజం విత్ స్మితలో సాయి పల్లవి పాల్గొన్న ఫుల్ ఎపిసోడ్ రేపటి నుండి సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.