పల్లవి:
వెన్నెల్లో ఆడపిల్లా
కవ్వించే కన్నెపిల్లా ...కోపంగా చూస్తే ఎల్లా..?
క్షణంలో అగ్గిపుల్లా !
చాలుచాల్లే గాలి మాటలాపు
పనేమీ లేదుగాని నీకు
పలకరించే వెన్నెల్లో ఓ జాబిలమ్మ
పులకరించే కబుర్లు విందాము రామ్మా..!
ఈవేళ కాని వేళ నీ తీరు మారిపోదా
నిజాయితీగా ఉన్న మగాణ్ణి నమ్మరాదా !
నా నీడ కూడా నిన్ను తాకి ఉలికిపడెనుగా !.... [వెన్నెల్లో ఆడపిల్లా]
చరణం 1:
దాయి దాయి అంటూ నను పిలిచిందే కల
ఇంత రాతివేళ నలుగురూ చూస్తే ఎలా ?
ప్రపంచానికేం వేరే పనిలేదుగా !
మన పనేదో మనదే కదా !
ఇదే మాట నా నుంచి రాలేదుగా !
మగువపైనే నిందేయదా ?
జో లాలిగా ! సమయం కాదుగా!
నిదుర ఈ పూట దరి చేరునా ?...[వెన్నెల్లో ఆడపిల్లా]
చరణం 2:
రేయి దాచుకున్న మెరుపుల జాబిల్లిని
దొంగచాటుగానే నేలకు తెచ్చేదెలా ?
అరె నువ్వు ముందుంటే నిన్ను చూడగా
చందమామే ఓడెనుగా !
ఇలా కారుకూతల్ని చెబితే ఎలా?
మానస్ నీకే రాసివ్వనా !
నీవైపుగా కథ మారిందిగా..!
వెలుగు నీడల్లే నీ నా జత ..... [వెన్నెల్లో ఆడపిల్లా]