ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'మావీరన్‌'

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 06:34 PM

మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ 'మావీరన్‌' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా తెలుగులో 'మహావీరుడు' గా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మావీరన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


ఈ చిత్రంలో అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో సరిత, యోగి బాబు, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa