ప్రస్తుత కాలంలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ఇప్పుడు అవకాశాలు లేక చాలామంది హీరోయిన్లు తెరమరుగవుతున్నారు. కొంతమంది సినిమాలలో అవకాశాలు లేక వ్యాపారాలు మొదలు పెడితే.. మరికొంతమంది తమ వొల్లును చూపించుకుంటూ గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోని ఇప్పుడు అవకాశాలు లేక అల్లాడుతుంది హీరోయిన్ మెహ్రీన్ .. ఈమధ్య వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యకరం..
తమిళంలో ఒక సినిమా, కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా మినహా ఈమె చేతిలో సినిమాలేవి లేకపోవడంతో ఆమె ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోయింది.. అందరూ హీరోయిన్ల లాగా సోషల్ మీడియాపై కాన్సెంట్రేట్ చేస్తుందా అంటే అది లేదు.. ఎప్పుడో ఒక ఫోటోషూట్ తప్పించి పెద్దగా అందాలు ఆరబోసే పని కూడా పెట్టుకోదు ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత లేటెస్ట్ గా తన ఇన్స్టా లో ఒక ఫోటోషూట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పువ్వులా కనిపిస్తూ కుర్రకారును కవ్వించింది. ఓర చూపులతో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.