ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి హీరోగా కళ్యాణి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ కమెడియన్ టిల్లు వేణు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేశారు.చిత్ర యూనిట్ ని కలిసి దర్శకుడు వేణుకి ఆప్యాయంగా శాలువా కప్పి సన్మానించి సినిమా అద్భుతంగా ఉందన్నారు. అలాగే నిర్మాత దిల్ రాజుకి శుభాకాంక్షలు తెలియజేశారు.