దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన "బలగం" మూవీ మార్చి 3న థియేటర్లలో విడుదలై, ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంటుంది. ప్రస్తుతం సెకండ్ వీక్ థియేట్రికల్ రన్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలైన 9వ రోజు అంటే నిన్న హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్లను రాబట్టినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే పెట్టుబడిని తీసుకొచ్చేసింది. మౌత్ టాక్ చాలా బాగుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ కలెక్షన్లను రాబడుతుంది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa