కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న "లియో" శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. జనవరి 2 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లియో చిత్రీకరణలో తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొంటున్నారు. ఈ మేరకు సంజయ్ దత్ కి ఆహ్వానం పలుకుతూ లియో చిత్రబృందం ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది.
ఈ సినిమాలో తలపతి విజయ్, త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa