ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరారి : ఆకట్టుకుంటున్న 'సిగ్గు సిగ్గు' వీడియో సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 05:11 PM

యోగేశ్వర్, అతిథి జంటగా, దర్శకుడు సాయి శివాజీ రూపొందించిన చిత్రం "పరారి". శ్రీ శంకర్ ఆర్ట్స్ బ్యానర్ పై జి వి వి గిరి ఈ సినిమాను నిర్మించగా, గాలి ప్రత్యూష సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. లేట్ మ్యూజిక్ కంపోజర్ చక్రి గారి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'సిగ్గు సిగ్గు' అనే లవ్ డ్యూయెట్ సాంగ్ కి సంబంధించిన వీడియో విడుదలయ్యింది. సింగర్స్ సునీత, యాజిన్ నిజార్ ఆలపించిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. మెలోడీ మ్యూజిక్ తో ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. పోతే, ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa