ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగచైతన్య రిలీజ్ చేసిన 'మాధవే మధుసూదన' ఫస్ట్ సింగిల్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 05:13 PM

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో ఆకట్టుకున్న చిత్రం 'మాధవే మధుసూదనా'. ఈ సినిమాతో తేజ్ బొమ్మదేవరా, రిషిక లోక్రే హీరోహీరోయిన్లుగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. బొమ్మదేవర రామచంద్ర రావు గారు రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. వికాస్ బడిశె సంగీతం అందిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా నుండి 'హొయ్ ! అలాంటి అందం ఇలాంటి నేలమీద ఎలాగ పుట్టిందో ఏమో ..ఏమిటో' అని సాగే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ విడుదలయ్యింది. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గారి చేతులమీదుగా ఈ సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa