గ్లోబల్ సెన్సేషన్ RRR సినిమాలోని నాటు నాటు పాట అత్యున్నత ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకోవాలని లక్షల మంది ప్రేక్షకులు బలంగా కోరుకుంటున్నారు. ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఈలోపు ఇండియాకు ఆస్కార్ అవార్డు రానే వచ్చింది.
ఈ ఏడాది జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో "ది ఎలిఫెంట్ విస్పరర్స్ " అనే ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విజేతగా నిలిచి, ఇండియాకు తొలి ఆస్కార్ ని తీసుకొచ్చింది. కార్తీక్ గోంస్లావ్స్ దర్శకత్వంలో రూపొందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే షార్ట్ ఫిలిం మానవజాతికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం నేపథ్యంలో తెరకెక్కింది.