ప్రస్తుతం 95వ అకాడెమి అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ లో గ్లోబల్ సెన్సేషన్ RRR లోని నాటు నాటు పాట ఉన్న విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం దక్కాలని భారతదేశ ప్రేక్షకులతో పాటు ప్రపంచదేశాల ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.
ఆస్కార్ రెడ్ కార్పెట్ పై RRR త్రయం రాజమౌళి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ... దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి, రాంచరణ్ తమ సతీమణులతో సహా ఆస్కార్ ఈవెంట్ కి హాజరయ్యారు.