ఫైనల్లీ... నాటు నాటుకి ఆస్కార్ వచ్చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమాలోని నాటు నాటు పాట అత్యున్నత ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకుంది. నాటు నాటు స్వరకర్త కీరవాణి, సాహిత్యకర్త చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ ప్రౌడ్ మూమెంట్ కోసం భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసారు.. చివరికి నాటు నాటుకు ఆస్కార్ లాంఛనమే అయ్యింది. ప్రతి ఒక్క RRR అభిమానికి, ప్రేక్షకులందరికీ కీరవాణి కృతజ్ఞతలు తెలిపారు.
ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చిన ఫస్ట్ ఫీచర్ ఫిలింగా RRR పేరు ఇండియన్ ఫిలిం హిస్టరీలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈ పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ రాజమౌళి, స్క్రీన్ పై అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరి చేత కాలు కదిపించిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ఎనర్జిటిక్ గా పాడిన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, స్వరకర్త కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్... పేర్లు ఇండియన్ సినిమా హిస్టరీలో చిరస్థాయిలో నిలిచిపోతాయి.