ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు.. నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది.కీరవాణి, చంద్రబోసు ఈ అవార్డు అందుకున్నారు.ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాటను సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేశారు. గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో ఈ పాటకు ఊపు తెచ్చారు.