ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం అదరగొట్టింది. ఇప్పటికే పలు కేటగిరిల్లో అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డానియల్ క్వాన్, డానియల్ షైనెర్ట్‌లు ఉత్తమ దర్శకులుగా అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ నటిగా మిచెల్లీ యోహో కూడా పురస్కారాన్ని దక్కించుకుంది.