టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి రావణాసుర అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ ఈ సినిమా టీజర్ ఫస్ట్ షాట్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు, యూట్యూబ్‌లో 13 మిలియన్ల వీక్షణలను ఈ సినిమా టీజర్ నమోదు చేసి సెన్సేషన్ ని సృష్టించింది.
అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్ అండ్ పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో హీరో సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ అండ్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.