ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును RRR చిత్రంలోని 'నాటునాటు' పాట కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ లకు అభినందనలు తెలియజేశారు.