ఆస్కార్ వేడుకల్లో హాలీవుడ్ చిత్రం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ దుమ్మురేపింది. వివిధ విభాగాల్లో ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకుంది. ఇక ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికి ఉత్తమనటిగా అవార్డు అందుకున్న మిషల్ యో ఆస్కార్ తీసుకున్న తొలి ఆసియా మహిళగా రికార్డ్ క్రియేట్ చేసింది.