95వ ఆస్కార్ ఈవెంట్ లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది మరియు జిమ్మీ కిమ్మెల్ దీనికి హోస్ట్ గా వ్యవహరించారు. 11 విభాగాల్లో నామినేట్ అయిన 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' అనే ఆంగ్ల చిత్రం 7 అవార్డులను కైవసం చేసుకుంది. 'RRR' లోని 'నాటు నాటు' సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ను గెలుచుకోవడంతో భారతీయ సినిమా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది.
వివిధ విభాగాల్లో 95వ అకాడమీ అవార్డులను గెలుచుకున్న తారల లిస్ట్
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - పినోచియో
సపోర్టింగ్ రోల్ ఆక్టర్ - కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
సపోర్టింగ్ రోల్ యాక్ట్రెస్ - జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నవల్నీ
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఎన్ ఐరిష్ గుడ్ బై
సినిమాటోగ్రఫీ - జేమ్స్ ఫ్రెండ్ (అల్ కాయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
మేకప్ అండ్ హైర్సటైలింగ్ – ది వేల్ (అడ్రియన్ మోరోట్, జూడీ చిన్ మరియు అన్నేమేరీ బ్రాడ్లీ)
కాస్ట్యూమ్ డిజైన్ - రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్)
అంతర్జాతీయ చలనచిత్రం - (అల్ కాయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ది ఎలిఫెంట్ విస్పర్స్ (కార్తికి గోన్సాల్వేస్ మరియు గునీత్ మోంగా)
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
ప్రొడక్షన్ డిజైన్ - అల్ కాయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం. గోల్డ్‌బెక్; సెట్ డెకరేషన్: ఎర్నెస్టైన్ హిప్పర్)
ఒరిజినల్ స్కోర్ - అల్ కాయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (వోల్కర్ బెర్టెల్‌మాన్)
విజువల్ ఎఫెక్ట్స్ – అవతార్ ది వే ఆఫ్ వాటర్ (జో లెటెరి, రిచర్డ్ బనేహమ్, ఎరిక్ సైండన్ మరియు డేనియల్ బారెట్)
ఒరిజినల్ స్క్రీన్ ప్లే - డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – ఉమెన్ టాకింగ్ (సారా పోలీ)
సౌండ్ - టాప్ గన్: మావెరిక్ (మార్క్ వీన్‌గార్టెన్, జేమ్స్ హెచ్. మాథర్, అల్ నెల్సన్, క్రిస్ బర్డన్ మరియు మార్క్ టేలర్)
ఒరిజినల్ సాంగ్ – నాటు నాటు (RRR: MM కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ మరియు చంద్రబోస్)
ఫిల్మ్ ఎడిటింగ్ - పాల్ రోజర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
డిరెక్టింగ్ - డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
లీడింగ్ రోల్ యాక్టర్ - బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
లీడింగ్ రోల్ యాక్ట్రెస్ - మిచెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ చిత్రం - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (డేనియల్ క్వాన్, డేనియల్ షీనెర్ట్ మరియు జోనాథన్ వాంగ్, నిర్మాతలు)