95వ ఆస్కార్ ఈవెంట్ లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది మరియు జిమ్మీ కిమ్మెల్ దీనికి హోస్ట్ గా వ్యవహరించారు. 'RRR' లోని 'నాటు నాటు' సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ను గెలుచుకోవడంతో భారతీయ సినిమా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా ఇప్పుడు, ఆస్కార్ 2023 హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో వివాదాన్ని సృష్టించాయి.
ఆస్కార్స్‌లో తన ప్రారంభ మోనోలాగ్ సందర్భంగా, జిమ్మీ కిమ్మెల్ మాగ్నమ్ ఓపస్ 'RRR' ని బాలీవుడ్ చిత్రంగా పేర్కొన్నాడు. ఇది TFI ప్రేక్షకుల అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సినిమా మూలాలను తెలుసుకోవడంలో అకాడమీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. మరి ఈ వ్యాఖ్యలపై అకాడమీ, జిమ్మీ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.