నేహా, వేదాంత్ వర్మ, ప్రణీతారెడ్డి బాలనటులుగా నటించిన సినిమా 'లిల్లీ'. ఈ సినిమాకి శివమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్‌వీర్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోంది. గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌కుమార్ నిర్మించారు.