నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన "రానా నాయుడు" వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా తొలిసారి తెరపై కనిపించబోతున్న విషయం తెలిసిందే కదా. రీసెంట్గానే స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసిన ఈ రివెంజ్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా నెట్ ఫ్లిక్స్ లో టాప్ #1 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇద్దరు స్టార్ హీరోల పవర్ఫుల్ వర్సటైల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించడంతో రానా నాయుడు వెబ్ సిరీస్ టాప్ లో దూసుకుపోతోందని తెలుస్తుంది. మరి, నిజ జీవితంలో ఫ్రెండ్లీగా ఉండే బాబాయ్- అబ్బాయ్ లు ఈ సిరీస్ లో బద్ద శత్రువులైన తండ్రీకొడుకులుగా ఎలా నటించారో... తెలుసుకోవాలంటే ... రానా నాయుడు మీరు కూడా చూసేయండి.