నాచురల్ స్టార్ నాని 'దసరా' పాన్ ఇండియా ప్రమోషన్స్ నిమిత్తం ప్రస్తుతం కేరళలో ఉన్నారు. అక్కడి యూనియన్ క్రిస్టియన్ కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి ధూమ్ ధామ్ స్టెప్పులేసి, ఫుల్ ఎంజాయ్ చేసారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చెన్నై, ముంబై ..ఇప్పుడు కేరళలో నాని దసరా ప్రమోషన్స్ ని ముమ్మరంగా జరుపుతున్నారు.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పోతే, రేపు దసరా ట్రైలర్ విడుదల కాబోతుంది.