ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదలైన "సార్ / వాతి" మూవీ సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. ఈ సినిమాకు తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించారు.
ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన "వా వాతి" లిరికల్ వీడియోకు శ్రోతల నుండి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాటను శ్వేతామోహన్ ఆలపించగా, హీరో ధనుష్ లిరిక్స్ అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా వా వాతి ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం పదింటికి వా వాతి ఫుల్ వీడియో సాంగ్ విడుదల కాబోతుంది.