'ది లెజెండ్' భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీతో లీడ్ హీరోగా డిబట్ ఎంట్రీ ఇచ్చారు... ప్రముఖ తమిళ వ్యాపారవేత్త, లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ అరుళ్. గతేడాది విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మధ్యనే ది లెజెండ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చి, ఓటిటిలో చిన్న తుఫానునే తీసుకొచ్చింది.
తాజాగా శరవణ ఈ రోజు కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పిక్స్ లో శరవణ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. న్యూ ట్రాన్సిషన్, డీటెయిల్స్ సూన్.. అని కామెంట్ చేస్తూ శరవణ పోస్ట్ చేసిన ఈ పిక్స్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరి, ఈ న్యూ మేకోవర్ న్యూ మూవీ కోసమేనని, తెలియకనే తెలుస్తుంది.