ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం "మీటర్". కొత్త దర్శకుడు రమేష్ కదూరి దర్శకత్వంలో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యొక్క టీజర్ ఇటీవలే విడుదలైన ఆడియన్స్ ని మెప్పించింది. లేటెస్ట్ గా ఈ రోజు మీటర్ ఫస్ట్ సింగిల్ 'ఛమ్మక్ ఛమ్మక్ పోరి' లిరికల్ వీడియో విడుదల కాబోతుంది. ఈ మేరకు సాయంత్రం ఐదింటి నుండి హైదరాబాద్ సంధ్య 70MM థియేటర్లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. అంతేకాక ఇరు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న 20ముఖ్య కేంద్రాలలో కూడా ఈ సాంగ్ లాంచ్ కాబోతుంది.