ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి గారి తనయుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్న కొత్తచిత్రం "ఉస్తాద్". ఈ సినిమాలో కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. విలక్షణ నటుడు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీరోల్ లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. కమెడియన్ రవి శివ తేజ పైలా ని 'రఘు' అనే హీరోకి జాన్ జిగిరీ దోస్త్ పాత్రలో ప్రేక్షకులకు పరిచయం చేస్తూ న్యూ పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకుడు కాగా, వారాహి చలనచిత్రం, క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |