చెలియా చెలియా చెలియా చెలియా
అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
తనువూ నదిలో మునిగివున్న
చెమట జడీలో తడిసిపోతున్న
చిగురు యదలో చితిగామారినది
విరహ జ్వాలే సెగలు రేపినది
మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చెలియా చెలియా చెలియా చెలియా
అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
తనువూ నదిలో మునిగివున్న
చెమట జడీలో తడిసిపోతున్న తడిసిపోతున్న తడిసిపోతున్న
శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలిరావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమె జాడ ఐన తెలియదేమే
ప్రతిక్షణం మానసిలా వెతికేనే నీకోసం
ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
చెలియా చెలియా చెలియా చెలియా
అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
తనువూ నదిలో మునిగివున్న
చెమట జడీలో తడిసిపోతున్న
గుండెలోన వలపు గాయం
మంట రేపే పిదప కాలం
ప్రాణయామా ప్రాణయామా తెలుసునా నీకైనా
దూరమైనా చెలిమి దీపం
భారమైన బ్రతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నేడైన
కలవు కావా నా కన్నుల్లో
నిముషమైన నీ కౌగిలిలో
సేద తీరాలి చేరువ నేస్తమా
చెలియా చెలియా చెలియా చెలియా
చెలియా చెలియా చెలియా చెలియా
అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
తనువూ నదిలో మునిగివున్న
చెమట జడీలో తడిసిపోతున్న
చిగురు యదలో చితిగామారినది
విరహ జ్వాలా సెగలు రేపినది
మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా