ఫిబ్రవరి 18న విడుదలైన "వినరో భాగ్యము విష్ణుకథ" చిత్రం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ టాక్ తో హౌస్ ఫుల్ థియేట్రికల్ రన్ జరుపుకుంది. తాజాగా ఈ నెల 22 నుండి ఉగాది సందర్భంగా ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని పూర్తి చేసుకుంది.
కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మల్టీ జానర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, అల్లు అరవింద్ గారు సమర్పకులుగా వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa